దేశంలో 50 ఏళ్లకు పైబడినవారికి వచ్చే నెల నుంచి కరోనా వ్యాక్సిన్
- భారత్ లో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్
- మార్చిలో ఎప్పుడైనా వృద్ధులకు కరోనా టీకా
- లోక్ సభలో వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి
- ఇతర దేశాలకు కూడా డోసులు పంపిస్తున్నామని వెల్లడి
కాగా, కరోనా వ్యాక్సిన్ల కోసం భారత్ కు పలు దేశాల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయని, వీటిలో 15 దేశాలకు గ్రాంట్ సహాయం కింద 56 లక్షల వ్యాక్సిన్ డోసులు పంపామని, కాంట్రాక్టు కింద 105 లక్షల డోసులు అందించామని డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు. కరోనా వ్యాక్సినేషన్, ఇతర చర్యల కోసం కేంద్రం ఇటీవల బడ్జెట్ లో రూ.35 వేల కోట్లు కేటాయించిందని, అవసరమైన పక్షంలో ఆ మొత్తం పెంచుతామని వెల్లడించారు.