మేనిఫెస్టో విడుదల చేసినందుకు చర్యలు తీసుకోండి.... చంద్రబాబుపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ
- పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు
- వైసీపీ ఆగ్రహం.. ఎస్ఈసీకి ఫిర్యాదు
- మేనిఫెస్టో రద్దు చేయాలని ఎస్ఈసీ ఆదేశాలు
- చంద్రబాబుపై కేసు నమోదు చేయాల్సిందేనంటున్న వైసీపీ
ఎస్ఈసీకి ఫిర్యాదు చేయడంపై లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన సంగతిని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. ఎస్ఈసీ ఆ మేనిఫెస్టో రద్దు చేసి అంతటితో సరిపెట్టారని ఆరోపించారు. దాంతో తాము చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని కోరామని అప్పిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఎస్ఈసీకి వినతిపత్రం అందించామని తెలిపారు.