నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం ఇష్టం ఉండదు: శ్రుతి హాస‌న్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం ఇష్టం ఉండదు: శ్రుతి హాస‌న్

sriti hassan slams netizens
  • త‌న ప్రేమ వ్య‌వ‌హారంపై శ్రుతి స్పంద‌న‌
  • ప్రస్తుతం నా  దృష్టంతా నా ప‌నిపైనే ఉంది
  • ఎదుటివారు కూడా నా‌ వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టొద్దు
  • నా ప‌నిపైనే దృష్టి పెడితే బాగుంటుంది
త‌న‌ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం త‌నకు ఇష్టం ఉండదని హీరోయిన్ శ్రుతి హాస‌న్ తెలిపింది. గ‌తంలో లండన్ గాయకుడు మైకేల్ కోర్సలేతో ప్రేమ‌లో మునిగి తేలిన ఆమె, ఇప్పుడు డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో  డేటింగ్ చేస్తోందన్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె దీనిపై స్పందించింది.  ప్రస్తుతం త‌న దృష్టంతా త‌న ప‌నిపైనే ఉందని తెలిపింది.

ఎదుటివారు కూడా త‌న‌ వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్ట‌కుండా త‌న‌ప‌ని పైనే దృష్టి పెడితే బాగుంటుంద‌ని శ్రుతిహాస‌న్ సూచించింది. కాగా, ప్ర‌స్తుతం తాను న‌టిస్తోన్న సినిమా సలార్ లో త‌న పాత్ర విభిన్నంగా ఉంటుంద‌ని శ్రుతి చెప్పింది. తాను ఆ సినిమా గురించి ఇప్పుడు ఏమీ చెప్పలేనని తెలిపింది. యంగ్ హీరో ప్ర‌భాస్‌ మంచి మనసున్న వ్యక్తి అని ప్ర‌శంసించింది. స‌లార్ సినిమా ద్వారా ప్ర‌భాస్‌తో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది.
sriti hassan
Tollywood
salar
Prabhas

More Telugu News