ఏపీ కరోనా అప్ డేట్: 104 మందికి పాజిటివ్
- గత 24 గంటల్లో 29,309 కరోనా పరీక్షలు
- అత్యధికంగా విశాఖ జిల్లాలో 27 కేసులు
- ప్రకాశం జిల్లాలో కొత్త కేసులు నిల్
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- యాక్టివ్ కేసుల సంఖ్య 1,197
అదే సమయంలో 147 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,88,004 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,79,651 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,197 మందికి చికిత్స జరుగుతోంది. అటు, మొత్తం మరణాల సంఖ్య 7,156కి పెరిగింది.