తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తుపై స్పష్టతనిచ్చిన నడ్డా!
- తమిళనాడులో జేపీ నడ్డా పర్యటన
- మధురైలో జరిగిన సభలో పాల్గొన్న నడ్డా
- అన్నాడీఎంకేతో పొత్తు కొనసాగుతుందని వ్యాఖ్య
- సీఎం అభ్యర్థిపై మాత్రం నో క్లారిటీ
తమిళనాడులో తమ కూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపై మాత్రం స్పష్టతనివ్వలేదు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని బీజేపీ నేతలు అంటున్నారు. కాగా, మధురైలో జరిగిన సభలో పాల్లొనే ముందు జేపీ నడ్డా మీనాక్షి దేవాలయాన్ని సందర్శించి, పూజల్లో పాల్గొన్నారు. అనంతరం పార్టీ కోర్ కమిటీ సమావేశంలో నేతలకు దిశా నిర్దేశం చేశారు.