ప్రతిపక్షాలతో కేంద్ర ప్రభుత్వం భేటీ
- మంత్రులు రాజ్ నాథ్, ప్రహ్లాద్ జోషిల వీడియో కాన్ఫరెన్స్
- సభ సాఫీగా సాగేలా చూడాలని కోరిన మంత్రులు
- తగ్గేదే లేదని తేల్చి చెప్పిన ప్రతిపక్ష నేతలు
- సాగు చట్టాలు రద్దు చేయాల్సిందేనని డిమాండ్
శుక్రవారం ప్రారంభమైన సమావేశాలు సాఫీగా సాగేలా చూడాలని ప్రతిపక్ష నేతలను వారు కోరారు. అయితే, తగ్గేదే లేదని ప్రతిపక్షాలు తేల్చి చెబుతున్నట్టు తెలుస్తోంది. సాగు చట్టాలను రద్దు చేసే దాకా తమ పోరాటం ఆగదని అన్నట్టు సమాచారం. ఇప్పటికే సభలో సాగు చట్టాల కాపీలను చించేసి వెల్ లోకి దూసుకెళ్లి ప్రతిపక్ష నేతలు నిరసన తెలిపారు.
మరోవైపు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. రాష్ట్రపతిని గౌరవించాలని ప్రతిపక్షాలకు ప్రహ్లాద్ జోషి కోరారు.