Somnath Bharathi: ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి రెండేళ్ల జైలు శిక్ష

AAP MLA Somnath Bharti Sentenced
షార్ట్స్‌లో చూడండి
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి ఢిల్లీ కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. 2016లో ఎయిమ్స్ సెక్యూరిటీ స్టాఫ్ పై దాడి చేసిన కేసులో ఈ శిక్షను ఖరారు చేసింది. జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించింది. అయితే ఆయనకు బెయిల్ కూడా మంజూరయింది. హైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అనుమతినిస్తూ బెయిల్ ఇచ్చింది. సోమనాథ్ భారతిపై ఉన్న అభియోగాలను ప్రాసిక్యూషన్ రుజువు చేసిందని ఈ సందర్భంగా అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాండే అన్నారు.

2016లో దాదాపు  300 మందితో పాటు కలిసి వచ్చిన సోమనాథ్ భారతి ఎయిమ్స్ వద్ద ఉన్న ఫెన్సింగ్ ను కూల్చేశారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ స్టాఫ్ పై దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో కోర్టు శిక్షను ఖరారు చేసింది.
Go Back to Shorts
Somnath Bharathi
AAP
Delhi Court
Sentence

More Telugu News