మీరు ఎలాగూ కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకం... కనీసం ఈడబ్ల్యూఎస్ అయినా అమలు చేయండి: సీఎం జగన్ కు పవన్ సూచన
- తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు
- 10 శాతం అమలుకు సీఎం కేసీఆర్ నిర్ణయం
- సీఎం కేసీఆర్ ను అభినందించిన పవన్ కల్యాణ్
- కేసీఆర్ స్ఫూర్తితో సీఎం జగన్ కూడా నిర్ణయం తీసుకోవాలని సలహా
"తెలంగాణ ముఖ్యమంత్రి అందించిన స్ఫూర్తితో గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్రంలోనూ 10 శాతం ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలి. ఉద్యోగాల్లోనూ, విద్యలోనూ, ఆర్థికంగానూ వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు ఎంతో కొంత ఉపశమనం ఉంటుంది. కాపులకు కూడా ఇది ఊరట కలిగిస్తుంది. మీరు ఎలాగూ కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకం కాబట్టి కనీసం ఈడబ్ల్యూఎస్ అయినా అమలు చేయండి. తద్వారా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు మేలు చేయండి" అంటూ పవన్ విజ్ఞప్తి చేశారు.