నేపాల్, శ్రీలంకలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్లు పంపిన భారత్
- కొవిషీల్డ్ వ్యాక్సిన్ల తరలింపు
- ఈ రోజు ముంబై నుంచి పంపిన అధికారులు
- నేపాల్‌కు మొత్తం 10 లక్షల డోసులు
- బంగ్లాదేశ్‌కు 20 లక్షల డోసులు
ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వీటిని పంపారు. మొదటి దశలో నేపాల్‌కు మొత్తం 10 లక్షలు, బంగ్లాదేశ్‌కు 20 లక్షల డోసులను పంపుతున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో పొరుగున ఉన్న ఆయా దేశాలకు భారత్ ఇప్పటికే ఔషధాలు, వైద్య పరికరాలను కూడా పంపిన విషయం తెలిసిందే. భారత్ నుంచి మొత్తం 30 మిలియన్ డోసుల ‘కోవిషీల్డ్’ను కొనుగోలు చేసేందుకు శ్రీలంక ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.