ఏపీలో కొత్తగా 173 కరోనా కేసుల నమోదు

20-01-2021 Wed 18:43
  • గత 24 గంటల్లో కోలుకున్న 196 మంది
  • ఒక్క మరణం కూడా నమోదు కాలేదు
  • ప్రస్తుతం రాష్ట్రంలో 1,637 యాక్టివ్ కేసులు
AP registers 173 new Corona cases

ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 173 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 46, అత్యల్పంగా శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో 3 కేసుల వంతున నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా మృతి ఒక్కటి కూడా సంభవించలేదు. 196 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,86,418కి చేరాయి. మొత్తం 7,142 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,637 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు 1,26,90,165 శాంపిల్స్ ని పరీక్షించారు.