Parliament: నేటి నుంచి ప్రారంభం కానున్న నూతన పార్లమెంట్ నిర్మాణ పనులు

  • రూ. 971 కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కేంద్రం
  • అక్టోబరు 2022 నాటికి నిర్మాణం పూర్తి
  • నిర్మాణ పనులను చేబడుతున్న టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్
New Parliament building construction starts today

కేంద్ర ప్రభుత్వం రూ. 971 కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల క్రితమే భవన నిర్మాణానికి 14 మంది సభ్యుల వారసత్వ కట్టడాల పరిరక్షణ కమిటీ ఆమోదం తెలిపింది. భవన నిర్మాణ ప్రాజెక్టును దక్కించుకున్న టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్.. 2022 అక్టోబరు నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయనుంది.

గుజరాత్‌కు చెందిన హెచ్‌సీపీ సంస్థ పార్లమెంట్ భవన డిజైన్‌ను రూపొందించింది. నిర్మాణంలో ప్రత్యక్షంగా 2 వేల మంది, పరోక్షంగా 9 వేల మంది పాల్గొంటారు. అలాగే,  200 మందికిపైగా హస్తకళాకారులు భాగస్వామ్యం పంచుకోనున్నారు. ఒకేసారి 1,224 మంది ఎంపీలు కూర్చునే విధంగా హాలును నిర్మించనున్నారు.

రెండు అంతస్తుల్లో నిర్మిస్తున్న పార్లమెంటు భవనంలో రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు ప్రత్యేక కార్యాలయాలు, పార్లమెంటు సభ్యుల కోసం విశాలమైన లాంజ్, గ్రంథాలయం, బహుళ కమిటీల గదులు, భోజనశాలలు ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంటు, ఎంపీ కార్యాలయ భవనానికి మధ్య భూగర్భ మార్గం ఏర్పాటు చేస్తారు.

More Telugu News