ఆ తెలంగాణ స్థానిక నాయకుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడంలేదు: కేఏ పాల్
- బైబిల్ పార్టీ కావాలా, భగవద్గీత కావాలా అని బండి సంజయ్ వ్యాఖ్యలు
- తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేఏ పాల్
- పిచ్చిపిచ్చిగా వాగుతున్నాడంటూ బండి సంజయ్ పై ఆగ్రహం
ఆర్ఎస్ఎస్ నేతలు కూడా తనను కలుసుకునేందుకు హోటల్ కు వస్తుంటారని కేఏ పాల్ వెల్లడించారు. కానీ ఈ నేత మాత్రం స్థానిక నాయకుడి స్థాయికి దిగజారిపోయి వ్యాఖ్యలు చేస్తున్నాడని బండి సంజయ్ పై విమర్శలు చేశారు. అమిత్ షా, నడ్డా, రాజ్ నాథ్ సింగ్ తదితరులు సైతం తనను గౌరవిస్తారని, వారు అభివృద్ధి చేద్దామని భావిస్తుంటారని, కానీ కుట్రలకు పాల్పడే ఇలాంటి నేతలు మాత్రం ఏపీ, తెలంగాణను రెచ్చగొడుతున్నారని తెలిపారు. ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకునేది లేదని, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. పవిత్ర గ్రంథాలతో రాజకీయాలు చేస్తారా? అంటూ ఆవేశం ప్రదర్శించారు.