తన ఆఫీసును ముంబై నుంచి గోవాకు తరలించిన రామ్ గోపాల్ వర్మ!
- అవసరమైతేనే ముంబైకి వస్తా
- నా ప్రాజెక్టులకు గోవా సరైన ప్రాంతం
- కరోనా కారణంగానే ఈ నిర్ణయం
తన ప్రాజెక్టులకు గోవా సరైన ప్రాంతమని భావించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నానని, లాక్ డౌన్ సమయంలో అధిక సమయం హైదరాబాద్ లోనే ఉండిపోయానని, ఆ తరువాత ముంబై నుంచి ఆఫీసును గోవాకు తరలించానని అన్నారు. కరోనా పరిస్థితులే తానీ నిర్ణయం తీసుకోవడానికి కారణమని వర్మ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మిధున్ చక్రవర్తి ప్రధాన పాత్రలో '12ఓ క్లాక్' అనే హారర్ చిత్రాన్ని వర్మ నిర్మిస్తున్న సంసగతి తెలిసిందే.