బయోసెక్యూరిటీ ప్రోటోకాల్ ను అంగీకరించిన టీమిండియా... టెస్టు సిరీస్ కొనసాగింపుపై తొలగిన అనిశ్చితి
- ఈ నెల 7 నుంచి సిడ్నీలో మూడో టెస్టు
- సిడ్నీలో కఠినమైన కరోనా నిబంధనలు
- బయో బబుల్ దాటి వెళ్లబోమన్న టీమిండియా
- ఐదుగురు ఆటగాళ్లకు ఆర్టీ-పీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్
అయితే సిడ్నీలో అమలు చేసే బయో సెక్యూరిటీ ప్రోటోకాల్ ను తాము తప్పకుండా పాటిస్తామని తాజాగా టీమిండియా మేనేజ్ మెంట్ అంగీకరించడంతో ఈ అనిశ్చితికి తెరపడింది. ఇకపై తమ ఆటగాళ్లు బయో బబుల్ ను దాటి బయటికి వెళ్లరని జట్టు యాజమాన్యం హామీ ఇచ్చింది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 7 నుంచి సిడ్నీలో మూడో టెస్టు జరగనుంది. ఇరు జట్ల మధ్య చివరి టెస్టు ఈ నెల 15న బ్రిస్బేన్ లో ప్రారంభం కానుంది.
కాగా, ఇటీవల మెల్బోర్న్ లోని ఓ రెస్టారెంటులో విందుకు వెళ్లిన రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పృథ్వీ షా, శుభ్ మాన్ గిల్, నవదీప్ సైనీలకు ఆర్టీ-పీసీఆర్ టెస్టు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చింది. మూడో టెస్టు ప్రారంభానికి ముందు మరోమారు వారికి పరీక్షలు నిర్వహించనున్నారు.