తిరుమలలో దర్శనానికి నేటి నుంచి సర్వ దర్శన టోకెన్లు!
- గత నెలలో నిలిపివేసిన దర్శనాలు
- నేటి నుంచి తిరిగి మొదలు
- విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో జారీ
తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే విష్ణు నివాసంతో పాటు భూ దేవి కాంప్లెక్స్ లో టోకెన్ల జారీ ప్రారంభం అయింది. టికెట్లను పొందేందుకు వచ్చే భక్తులు కరోనా నిబంధనలను పాటించాలని, మాస్క్ ధరించి రావాలని, చేతులను శానిటైజ్ చేసుకుంటూ భౌతిక దూరం పాటించాలని అధికారులు కోరారు.