punjab: పంజాబ్ సీఎం తలకు మిలియన్ డాలర్ల నజరానా.. కేసు నమోదు

Poster Offers 10 Lakh Dollars For Killing Punjab CM Amarinder Singh
షార్ట్స్‌లో చూడండి
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను చంపిన వారికి మిలియన్ డాలర్లు నజరానాగా ఇస్తామంటూ ఓ గోడపై కనిపించిన పోస్టర్ కలకలం రేపింది. సెక్టార్ 66-67 క్రాసింగ్ సమీపంలోని ఓ గోడకు అంటించిన గైడ్ మ్యాప్‌పై ఇలా ప్రచురించారని, దానిపై ఈ-మెయిల్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పోస్టర్ అంటించిన గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డిసెంబరు 31న ఈ పోస్టర్ అంటించినట్టు మొహాలీ సిటీ ఎస్పీ తెలిపారు. పోస్టర్ అంటించిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు.
Go Back to Shorts
punjab
Captain Amarinder Singh
wall poster
Killing

More Telugu News