తిరుమలలో ఉత్సాహంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన భక్తులు!

Tirumala Piligrims Welcome New Year
  • కొండపై మిన్నంటిన గోవింద నామాలు
  • దాదాపు 50 వేల మందికి దర్శనం
  • ఎస్వీబీసీకి రిలయన్స్ కోటి విరాళం
కోట్లాది మంది కొంగు బంగారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి నెలకొన్న తిరుమలలో కొత్త సంవత్సరపు వేడుకలు ఉత్సాహంగా సాగాయి. నిన్న రాత్రి 11.45 గంటల సమయంలో ఆలయం ముందుకు చేరిన వందలాది మంది భక్తులు గోవింద నామాలను పఠిస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. దాదాపు 50 వేల మంది స్వామి వారి దర్శనానికి రాగా, వారందరికీ నేడు దర్శనం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.

కొత్త సంవత్సరం సందర్భంగా తిరుమలను విద్యుద్దీప కాంతులతో అలంకరించారు. ఇదిలావుండగా, ఎస్వీబీసీ (శ్రీ వెంకటేశ్వరా భక్తి చానెల్) ట్రస్టుకు రిలయన్స్ సంస్థ రూ.1.01 కోట్ల విరాళాన్ని అందించింది. రిలయన్స్ తరఫున సంస్థ ప్రతినిది శివశంకర్, టీటీడీ ఈఓ ధర్మారెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన డీడీలను అందించారు.
Go Back to Shorts
Tirumala
Tirupati
TTD
Reliance
New Year

More Telugu News