మే 4 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు... షెడ్యూల్ ప్రకటించిన కేంద్రం
- మే 4 నుంచి జూన్ 10 వరకు పరీక్షలు
- సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకటన
- మార్చిలో ప్రాక్టికల్స్
- జూలై 15న ఫలితాల వెల్లడి
వాస్తవానికి సీబీఎస్ఈ ప్రాక్టికల్ పరీక్షలు జనవరిలోనూ, పరీక్షలు ఫిబ్రవరి-మార్చిలోనూ జరుగుతాయి. అయితే, కరోనా మహమ్మారి ప్రభావం, కొత్త స్ట్రెయిన్ కలకలం, ఇంటర్నెట్ సమస్యలతో ఆన్ లైన్ క్లాసులు సరిగా అందుబాటులోకి రాని వైనం... తదితర సమస్యలను విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వారి అభ్యర్థనలను సానుకూల ధోరణితో పరిగణనలోకి తీసుకున్న కేంద్రం సీబీఎస్ఈ పరీక్షలను మేలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది.