దత్త పుత్రుడు పవన్, సొంత పుత్రుడు లోకేశ్ లను రంగంలోకి దించారు: అవంతి శ్రీనివాస్
- 30 లక్షల ఇళ్ల పట్టాలను ఇవ్వడం జగన్ మాత్రమే సాధ్యమైంది
- సంక్షేమ పథకాల విషయంలో జగన్ కు ఆయనే సాటి
- ఎన్ని కుట్రలు చేసినా జగన్ ను ఏమీ చేయలేరు
విశాఖ సౌత్ లో టీడీపీ గెలిచినప్పటికీ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు దత్త పుత్రుడు పవన్ కల్యాణ్, సొంత కుమారుడు నారా లోకేశ్ ను చంద్రబాబు రంగంలోకి దింపారని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుతంత్రాలకు పాల్పడినా జగన్ ను ఏమీ చేయలేరని అన్నారు.