కొత్తరకం కరోనా నేపథ్యంలో సరికొత్త నినాదం రూపొందించిన కేంద్రమంత్రి అథవాలే
- గతంలో 'గో కరోనా గో' అంటూ నినాదం
- తాజాగా దేశంలో కరోనా నూతన స్ట్రెయిన్ కలకలం
- 'నో కరోనా నో' అంటూ కొత్త నినాదం రూపొందించిన అథవాలే
- గత అక్టోబరులో కరోనా బారినపడిన కేంద్రమంత్రి
గతంలో తాను చేసిన 'గో కరోనా గో' అనే నినాదం విజయవంతంమైందని, నిజంగానే కరోనా వెళ్లిపోతోందని, ఇప్పడు కొత్తరకం కరోనా వైరస్ కూడా తన 'నో కరోనా నో' నినాదంతో వెళ్లిపోతుందని కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే వివరించారు. కరోనా గురించి ఇంత శ్రద్ధగా మాట్లాడే ఈ కేంద్రమంత్రికి గత అక్టోబరులో కరోనా సోకింది. గట్టి చికిత్స అనంతరం కోలుకుని మళ్లీ ఆరోగ్యవంతులయ్యారు.