ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం జగన్

CM Jagan attends Justice Krishna Mohan daughter wedding Mangalagiri
  • మంగళగిరిలో జస్టిస్ కృష్ణమోహన్ కుమార్తె అమృత పెళ్లి
  • వధూవరులకు ఆశీస్సులు అందించిన సీఎం జగన్
  • సీఎం రాకతో పెళ్లివేడుకలో మరింత సందడి
సీఎం జగన్ ఇవాళ ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి బొప్పూడి కృష్ణమోహన్, వసంతలక్ష్మి దంపతుల కుమార్తె అమృత వివాహం ఇవాళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సీఎం జగన్ విచ్చేశారు. వధూవరులకు ఆశీస్సులు అందజేశారు. సీఎం రాకతో పెళ్లివేడుకలో మరింత సందడి నెలకొంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
Go Back to Shorts
Jagan
Justice Krishna Mohan
Daughter
Wedding
Mangalagiri

More Telugu News