కమలహాసన్ కు షాకిచ్చిన కీలక నేత.. బీజేపీలో చేరిక!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కమలహాసన్ కు షాకిచ్చిన కీలక నేత.. బీజేపీలో చేరిక!

Kamal Haasan party leader joins BJP
  • బీజేపీలో చేరిన పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం
  • ప్రకాశ్ జవదేకర్ సమక్షంలో బీజేపీలో చేరిక
  • తమిళనాడులో దూకుడు పెంచుతున్న బీజేపీ
తమిళనాడులో బీజేపీ దూకుడు పెంచుతోంది. ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటూ పార్టీ బలాన్ని పెంచుకునేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలో కమలహాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ కు బీజేపీ షాక్ ఇచ్చింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత అరుణాచలం ఈరోజు బీజేపీలో చేరారు.

అరుణాచలం ఇప్పటి వరకు మక్కల్ నీది మయ్యమ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. చెన్నైలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.

అరుణాచలం బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. కమలహాసన్ ప్రచారాన్ని ఉద్ధృతం చేసిన తరుణంలో ఆయన పార్టీ  మారడం ఆసక్తికరంగా మారింది. పార్టీ వ్యవహారాల పట్ల అసంతృప్తితోనే ఆయన బీజేపీలో చేరినట్టు చెబుతున్నారు.
Makkal Needhi Mayyam
Kamal Haasan
Prakash Javadekar
BJP

More Telugu News