ఏపీ కరోనా అప్ డేట్: రాష్ట్రంలో కొత్తగా 357 పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 59,551 కరోనా టెస్టులు
- నలుగురి మృతి
- 355 మందికి కరోనా నయం
- యాక్టివ్ కేసుల సంఖ్య 3,862
కాగా, రాజమండ్రిలో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం రేగగా, దానిపై రాష్ట్ర ఆరోగ్యమంత్రి ఆళ్ల నాని వివరణ ఇచ్చారు. బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు సోకింది కొత్తరకం కరోనా వైరస్సా, కాదా అనేది నిర్ధారణ కావాల్సి ఉందని వెల్లడించారు. ఆమెతో పాటు, ఆమె కుటుంబ సభ్యులను కూడా ఐసోలేషన్ కు తరలించామని చెప్పారు. ఏపీలో కరోనా సెకండ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సర్కారు అన్ని విధాలా సంసిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.