ముంబై పబ్ లో క్రికెటర్ సురేశ్ రైనా అరెస్ట్.. విడుదల

Mumbai police arrests Suresh Raina
  • నిబంధనలు పాటించని పబ్
  • కరోనా నియమావళి ఉల్లంఘన
  • పబ్ పై దాడి చేసి 34 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • అరెస్టయిన వారిలో హృతిక్ రోషన్ మాజీ భార్య
ప్రముఖ క్రికెటర్ సురేశ్ రైనాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ముంబయి ఎయిర్ పోర్టు సమీపంలోని 'డ్రాగన్ ఫ్లై పబ్'ను నిర్వాహకులు తెరిచి ఉంచినట్టు పోలీసులు గుర్తించారు. ఈ పబ్ పై దాడులు చేసిన ముంబయి పోలీసులు అక్కడ ఎంజాయ్ చేస్తున్న సురేశ్ రైనా, గాయకుడు గురు రణధావా సహా 34 మందిని అరెస్ట్ చేశారు. అనంతరం వీరిని స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు.

కాగా, అరెస్టయిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ అర్ధాంగి సుజానే ఖాన్ కూడా ఉన్నారు. నిర్దేశించిన సమయం మించి పబ్ తెరిచి ఉంచారని, ఇతరత్రా నియమాల ఉల్లంఘన కూడా జరిగిందని అరెస్ట్ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు. బ్రిటన్ లో కరోనా కొత్తరకం వెలుగు చూసిన నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Suresh Raina
Police
Dragon Fly Pub
Mumbai
Corona Virus

More Telugu News