ఆవును కొట్టాడన్న కోపంతో వ్యక్తి దారుణ హత్య!
- కాన్పూర్ లో కలకలం రేపిన ఘటన
- పిల్లలు ఆడుకుంటుంటే వచ్చిన ఆవు
- కర్రతో మందలించడంతో మొదలైన ఘర్షణ
- నిందితుడు పరారీలో ఉన్నాడన్న పోలీసులు
ఆ సమయంలో గుప్తా పిల్లలు బయట ఆడుకుంటున్నారు. వారు భయపడుతుండటంతో, ఓ కర్రను తెచ్చిన గుప్తా, దాన్ని అదిలించాడు. ఈ ఘటనను చూసిన ఆయుష్ యాదవ్, రమణ గుప్తాతో గొడవకు దిగాడు. ఆపై కర్ర తీసుకుని వచ్చి దారుణంగా కొట్టాడు. ఈ దాడిలో రమణ గుప్తా తీవ్రంగా గాయపడగా, బంధువులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతని ప్రాణాలు పోయాయని వైద్యులు వెల్లడించగా, విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రధాన నిందితుడు ఆయుష్ యాదవ్ తన కుటుంబంతో సహా పరారయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. జరిగిన ఘటనపై మృతుడి భార్య స్పందిస్తూ, చిన్న కారణానికే తన భర్తను హత్య చేశారని ఆరోపించారు. గొడవ తరువాత తన భర్తను ఆసుపత్రికి తీసుకుని వెళ్లామని, అప్పటికే మృతి చెందాడని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.