KCR: రేపు ఢిల్లీకి వెళుతున్న కేసీఆర్

KCR going to Delhi
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీకి వెళుతున్నారు. రెండు రోజుల పాటు ఆయన అక్కడే మకాం వేయనున్నారు. మన దేశంలోకి కరోనా ప్రవేశించిన తర్వాత ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళుతుండడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కేసీఆర్ కలవనున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిల గురించి మాట్లాడతారు.

కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ నేతలంతా కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మళ్లీ వారితోనే కేసీఆర్ భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఢిల్లీలో ఎల్లుండి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేసీఆర్ భూమిపూజ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Go Back to Shorts
KCR
TRS
Delhi

More Telugu News