పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఆరోగ్య పరిస్థితి విషమం
- ఊపిరి తీసుకోవడంలో తలెత్తిన ఇబ్బందులు
- క్రిటికల్ కేర్ యూనిట్ లో ఉన్న మాజీ సీఎం
- శరీరం చికిత్సకు స్పందిస్తోందన్న వైద్యులు
76 ఏళ్ల భట్టాచార్య ప్రస్తుతం క్రిటికల్ కేర్ యూనిట్ లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆసుపత్రికి చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు. అయితే, కరోనా నెగెటివ్ రావడం ఒక గుడ్ న్యూస్ అని అన్నారు. ఆయన శరీరం చికిత్సకు స్పందిస్తోందని చెప్పారు. బీపీ, పల్స్ రేటు సాధారణంగా ఉన్నాయని తెలిపారు. వృద్ధాప్య సంబంధిత రుగ్మతలతో ఆయన బాధపడుతున్నారని చెప్పారు.