Sanchaita: కొత్త వ్యవసాయ చట్టాలు ల్యాండ్ మార్క్ వంటివి: సంచయిత

Sanchita support farm laws
షార్ట్స్‌లో చూడండి
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు చేపట్టిన భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలు ఇబ్బంది పడకూడదనే కారణంతో మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ చేపట్టారు. ఈ వ్యవసాయ చట్టాలు చాలా ఉపయోగకరమైనవని మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ సంచయిత అన్నారు. దీనికి సంబంధించి ఆమె ట్వీట్ చేశారు.  

మార్పు ఏదైనా సరే కొంత వ్యతిరేకతను ఎదుర్కోవడం సహజమని సంచయిత అన్నారు. మార్పును మనం స్వాగతించాలని చెప్పారు. వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొచ్చేందుకు కొత్త వ్యవసాయ చట్టాలు ఒక ల్యాండ్ మార్క్ వంటివని అన్నారు. అందరం కలసి ప్రధాని మోదీకి మద్దతు పలుకుదామని చెప్పారు.
Go Back to Shorts
Sanchaita
Farm Laws
YSRCP

More Telugu News