ఏపీ కరోనా అప్ డేట్: రాష్ట్రంలో మరింతగా దిగొచ్చిన కొత్త కేసులు
- గత 24 గంటల్లో 43,006 కరోనా పరీక్షలు
- 316 మందికి పాజిటివ్
- అత్యధికంగా గుంటూరు జిల్లాలో 87 కేసులు
- అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 3 కేసులు
- యాక్టివ్ కేసుల సంఖ్య 5,626
అదే సమయంలో 595 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఐదుగురు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 7,038కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,72,288 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,59,624 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 5,626 మందికి చికిత్స జరుగుతోంది.