బోకోహరమ్ తీవ్రవాదుల ఘాతుకం.. పొలంలో పనిచేసుకుంటున్న 43 మంది కూలీల గొంతు కోసిన వైనం!
- నైజీరియాలోని మైదుగురి నగర సమపంలో దారుణ ఘటన
- చేతులు కట్టేసి, గొంతులు కోసిన తీవ్రవాదులు
- దేశం మొత్తం చింతిస్తోందన్న అధ్యక్షుడు
ఉగ్రవాదుల చేతిలో మృతి చెందిన రైతులకు ప్రభుత్వం సామూహిక అంత్యక్రియలు నిర్వహించింది. హత్యకు గురైన రైతు కూలీల్లో పదిమంది మహిళలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహ్మద్ బుహారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యావత్ దేశం ఈ ఘటనపై చింతిస్తోందన్నారు.