'ప్రియమైన బీజేపీ మేనిఫెస్టో రచయితల్లారా..' అంటూ కేటీఆర్ సెటైర్లు
- బీజేపీ మేనిఫెస్టోపై కేటీఆర్ విసుర్లు
- మేము చేసిన పనుల ఫొటోలను మీ మేనిఫెస్టోలో పెట్టుకోవడం సంతోషకరం
- మేము చేసిన పనులకు దీన్నొక అభినందనగా భావిస్తున్నాం
'ప్రియమైన బీజేపీ మేనిఫెస్టో రచయితల్లారా... టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనుల ఫొటోలను జీహెచ్ఎంసీ మేనిఫెస్టోలో పెట్టినందుకు సంతోషంగా ఉంది. మేము చేసిన పనులకు దీన్నొక అభినందనగా భావిస్తున్నాం' అని ట్వీట్ చేశారు. ఓ టీఆర్ఎస్ అభిమాని చేసిన ట్వీట్ ను షేర్ చేస్తూ ఆయన ఈ మేరకు స్పందించారు. 'కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలె' అంటూ వారు చెప్పిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నానంటూ బీజేపీని దెప్పిపొడిచారు.