అబద్ధాలను ప్రచారం చేయడంలో తండ్రీకొడుకులు పోటీపడుతున్నారు: కిషన్ రెడ్డి
- నగర ప్రజలు మార్పును కోరుకుంటున్నారు
- విద్యార్థులు, యువత, మహిళలే జీజేపీకి బలం
- ఇంటి నిర్మాణాలకు మేం అధిక ప్రాధాన్యతను ఇస్తాం
దుబ్బాక ఉప ఎన్నికలో కూడా యువత ప్రధాన పాత్రను పోషించిందని కిషన్ రెడ్డి చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో కూడా వారు ప్రధాన పాత్రను పోషిస్తారని అన్నారు. దేశంలో ఉన్న 80 శాతం కార్పొరేషన్లు బీజేపీ చేతిలోనే ఉన్నాయని చెప్పారు. నగరంలో ఇంటి నిర్మాణాలకు తాము అధిక ప్రాధాన్యతను ఇస్తామని అన్నారు. తమ మేనిఫెస్టోలో ఈ వివరాలన్నీ ఉంటాయని తెలిపారు. తండ్రీకొడుకులు ఇద్దరూ కేంద్ర ప్రభుత్వంపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని కేసీఆర్, కేటీఆర్ లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.