హీరో ప్రభాస్ ఫొటో చూసి షాక్ అవుతోన్న నెటిజన్లు!

25-11-2020 Wed 13:29
  • ప్రస్తుతం రాధేశ్యామ్ లో నటిస్తోన్న ప్రభాస్
  • తదుపరి సినిమాల కోసం కొత్తలుక్
  • సన్నగా కనపడుతోన్న ప్రభాస్
prabhas new look goes viral

సినీ హీరో ప్రభాస్ కొత్త లుక్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సాధారణంగా హ్యాండ్ సమ్‌గా,  కండలు తిరిగిన శరీంతో కనపడే ప్రభాస్ చాలా సన్నగా కనపడుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న `రాధేశ్యామ్`  సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.  
        ఈ సినిమా తర్వాత మరో సినిమాలో నటించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన బరువు తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు. అలాగే, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందించనున్న ‘ఆదిపురుష్’ సినిమాలో ఆయన రాముడి గెటప్‌లో కనపడాల్సి ఉంది. ఈ సినిమాల కోసమే ప్రభాస్ ఇలా స్లిమ్ గా మారినట్టు తెలుస్తోంది. గతంలో ప్రభాస్ ఫొటోను, ఇప్పటి ఫొటోను పోల్చి చూస్తూ నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు.