రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికిన సీఎం జగన్!
- తిరుపతి పర్యటన నిమిత్తం వచ్చిన రామ్ నాథ్ కోవింద్
- స్వాగతం పలికిన గవర్నర్, మంత్రులు
- తిరుచానూరుకు పయనమైన రాష్ట్రపతి దంపతులు
ఆపై ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గాన తిరుచానూరుకు వెళ్లనున్న రాష్ట్రపతి దంపతులు, పద్మావతి అమ్మవారిని దర్శించుకుని, అక్కడి నుంచి మధ్యాహ్నానికి తిరుమలకు వెళ్లనున్నారు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని స్వామివారిని దర్శించుకున్న అనంతరం, సాయంత్రం తిరిగి రేణిగుంట చేరుకుని ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ కు బయలుదేరి వెళతారు.