తన క్యాబినెట్ ను ప్రకటించిన జో బైడెన్!
- విదేశాంగ మంత్రిగా ఆంటోనీ బ్లింకెన్
- జాన్ కెర్రీ వాతావరణ విభాగానికి అధిపతి
- హోమ్ ల్యాండ్ సెక్యూరిటీకి మాయోర్కస్
సీఐఏ మాజీ డిప్యూటీ డైరెక్టర్ ఆర్విల్ హైన్స్ ను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా నియమిస్తున్నట్టు తెలిపారు. ఈ పదవికి అమెరికా చరిత్రలో ఓ మహిళను ఎంచుకోవడం ఇదే తొలిసారి. ఇక యునైటెడ్ నేషన్స్ లో అమెరికా ప్రతినిధిగా లిండా థామస్- గ్రీన్ ఫీల్డ్ ను నియమించారు. బైడెన్ అమెరికాకు ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో సెక్యూరిటీ సేవలను అందించిన జాక్ సుల్లివాన్ ను వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ గా నియమించారు.
కాగా, వీరంతా 2009 నుంచి 2017 మధ్య ఒబామా - బైడెన్ పాలన జరుగుతున్న కాలంలో వారి వారి రంగాల్లో అపారమైన అనుభవాన్ని కలిగున్న సీనియర్లు కావడం గమనార్హం.