మహమ్మారి మళ్లీ విరుచుకుపడేలా ఉంది.. జాగ్రత్త: కేసీఆర్
- దేశంలో పలు రాష్ట్రాల్లో మళ్లీ వెలుగుచూస్తున్న కేసులు
- రెండో దశ వచ్చినా తట్టుకుని నిలబడ గలిగేలా రాష్ట్రం
- ఆక్సిజన్ సౌకర్యంతో 10 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయి
రాష్ట్రంలో మళ్లీ కరోనాకు ముందునాటి పరిస్థితులు నెలకొంటున్నాయని, కేసుల సంఖ్య బాగా తగ్గిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 2.1 శాతంగా ఉండగా, రికవరీ రేటు 94.03 శాతం ఉందని తెలిపారు. మరణాల రేటు చాలా తక్కువగా ఉందని, అయినప్పటికీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని పేర్కొన్నారు. కరోనా చికిత్స కోసం రాష్ట్రవ్యాప్తంగా పదివేల పడకలు ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం కష్టపడుతోందని, ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని సూచించారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.