Australia: అబద్ధం చెప్పిన పిజ్జా డెలివరీ బాయ్.. ఆస్ట్రేలియాలోని ఓ రాష్ట్రంలో అలజడి

ruckus in australia
షార్ట్స్‌లో చూడండి
ఓ పిజ్జా డెలివరీ బాయ్ తాను చేస్తోన్న ఉద్యోగం గురించి బయటకు చెప్పుకోలేక ఓ అబద్ధం ఆడడంతో ఆస్ట్రేలియాలోని ఓ రాష్ట్రమంతా కలకలం చెలరేగింది. సౌత్ ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్‌లో విదేశీయులు ఐసోలేషన్‌లో ఉండే ఓ హోటల్‌‌లో ఓ వ్యక్తి పనిచేస్తున్నాడు. అతడికి ఇటీవల కరోనా నిర్ధారణ అయింది.  దీంతో ఆ హోటల్‌లో ఉంటోన్న విదేశీయులు ఆందోళన చెందారు.

కరోనా చైన్ ను అరికట్టే పనిలో భాగంగా అతడు ఎక్కడికి వెళ్లాడనే విషయాన్ని అధికారులు తెలుసుకోవాలానుకున్నారు. అతడు ఎవరెవరిని కలిశాడు వంటి విషయాలపై ఆరా తీశారు.
దీంతో తాను ఓ ప్రముఖ పిజ్జా బార్‌లో పిజ్జా కొనడానికి వెళ్లాలని చెప్పాడు. ఆ షాపులోని వారికి కూడా కరోనా వచ్చే అవకాశం ఉందని చెప్పాడు.

దీంతో అతడికి ఎవరి నుంచి కరోనా సోకిందో తెలుసుకునే వీలు లేకపోవడంతో ఆ రాష్ట్రంలో సెకండ్ వేవ్ కరోనా వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్ విధించారు. అధికారులు ఆ కేసును ట్రేస్ చేసే క్రమంలో ఓ విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. కరోనా సోకిన ఆ వ్యక్తి ఓ పిజ్జా పార్లర్‌లో పార్ట్ టైమ్ జాబ్‌ చేస్తున్నట్లు గుర్తించారు.

పిజ్జా డెలివరీ బాయ్‌గా తాను చేస్తోన్న ఉద్యోగాన్ని చెప్పుకోవడానికి అతడు సిగ్గుపడి పిజ్జా కొనడానికి వెళ్లానని అసత్యం చెప్పాడని నిర్ధారించుకున్నారు. చివరకు పిజ్జా పార్లర్‌లో పనిచేసే ఓ సెక్యూరిటీ గార్డు వల్ల అతడికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు తేల్చారు. దీంతో వెంటనే లాక్‌డౌన్‌ను రద్దు చేశారు.  అతడు చెప్పిన అబద్ధం రాష్ట్రం మొత్తం అలజడి రేపిందని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  


Go Back to Shorts
Australia
Corona Virus
COVID19

More Telugu News