జీహెచ్ఎంసీ ఎన్నికల పొత్తుపై జనసేన, బీజేపీ పరస్పర విరుద్ధ ప్రకటనలు!
- బీజేపీ నేతలు పవన్ ను కలవనున్నారని జనసేన ప్రకటన
- జనసేనతో ఎలాంటి పొత్తు ఉండదంటున్న బండి సంజయ్
- కార్యకర్తల్లో అయోమయం
కానీ, బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి జనసేనతో ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేశారు. అటు, బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి కూడా ఇదే విషయం వెల్లడించారు. జనసేనతో పొత్తు విషయమై చర్చించడానికి బీజేపీ అగ్రనేతలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సమావేశమవుతున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయని, అయితే బీజేపీ ఇప్పటివరకు ఎలాంటి సమావేశానికి అంగీకరించలేదని అన్నారు.