‘దుబ్బాక’ ఎన్నికల ముందు కూడా ఇలాగే మాట్లాడారు: కేసీఆర్‌పై విజయశాంతి విమర్శలు
- జీహెచ్ఎంసీలో గెలుస్తామంటూ కేసీఆర్ వ్యాఖ్యలు
- కేసీఆర్ గారివన్నీ అవకతవక సర్వేలు
- ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గారు
- జీహెచ్ఎంసీ ఎన్నికలు రోజుల్లోనే జరపాలని ప్రయత్నం
‘జీహెచ్ఎంసీలో గెలుపు మాదేనంటున్న ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారివన్నీ అవకతవక సర్వేలు. దుబ్బాక ఎన్నికల ముందు కూడా ఇలాగే మాట్లాడారు. దుబ్బాక ఫలితం సానుభూతి తప్ప మరొకటి కాదని సీఎం గారు అన్నారు. ఆ సానుభూతి టీఆర్ఎస్‌కు ఎందుకు లభించలేదో కూడా చెప్పాలి. ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి జీహెచ్ఎంసీ ఎన్నికలు రోజుల్లోనే జరపటానికి నిర్ణయించినట్టు కనబడుతోంది’ అని విజయశాంతి ట్వీట్లు చేశారు.