sonia agarwal: హీరోయిన్ సోనియా అగర్వాల్ షేర్ చేసిన ఫొటో చూసి షాక్ అవుతోన్న నెటిజన్లు!

sonia pic goes viral
  • సాధారణంగా బొద్దుగా కనిపించే హీరోయిన్ 
  • సన్నగా మారిపోయిన వైనం
  •  సర్జరీ చేయించుకుని బరువు తగ్గిందని నెటిజన్ల కామెంట్లు  
హీరోయిన్ సోనియా అగర్వాల్ షేర్ చేసిన ఫొటో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. సాధారణంగా బొద్దుగా కనిపించే ఈ హీరోయిన్ సన్నగా మారిపోవడమే అందుకు కారణం. బొద్దుగా కనపడే ఆమె ఇంత సన్నగా అయిపోవడానికి కారణాలేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆమె సర్జరీ చేయించుకుని బరువు తగ్గిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

కాగా, '7జీ బృందావన్ కాలనీ',  'నీ ప్రేమకై' వంటి సినిమాల్లో నటించి టాలీవుడ్‌లో ఆమె మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. బుల్లితెరపై కూడా ఆమె కనపడి అలరించింది. హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరిస్తోన్న సమయంలోనే  దర్శకుడు సెల్వ రాఘవన్‌ను 2006లో ఆమె పెళ్లి చేసుకుంది. 2010లో ఆయనకు విడాకులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె తెలుగులో రామ్ హీరోగా వస్తోన్న రెడ్ సినిమాలోనూ ఓ పాత్రలో నటిస్తోంది.
sonia agarwal
Tollywood
Tamilnadu

More Telugu News