Avika Gor: కాబోయే భర్తను పరిచయం చేసిన అవికా గోర్

Avika gor introduces Milind Chandwani
షార్ట్స్‌లో చూడండి
కొన్నేళ్ల కిందట ఉత్తరాది రాష్ట్రాలో 'బాలికా వధు' టీవీ సీరియల్ ఎంతటి ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సీరియల్ తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు' పేరుతో రాగా, ఇక్కడ కూడా హిట్టయింది. ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో నటించిన అవికా గోర్ తదనంతర కాలంలో సినీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. 'ఉయ్యాలా జంపాలా' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ అమ్మడు 'లక్ష్మీ రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్త మావ', 'తను నేను', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'రాజుగారి గది-3' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

ఇటీవల వరకు బాగా బొద్దుగా కనిపించిన అవికా లేటెస్ట్ పిక్స్ చూస్తే నమ్మలేనంత స్లిమ్ గా తయారైందని ఒప్పుకుంటారు. ఇక అసలు విషయానికొస్తే... అవికా తన కాబోయే జీవిత భాగస్వామి గురించి సోషల్ మీడియాలో వెల్లడించింది. మిలింద్ చంద్వానీని పెళ్లాడబోతున్నట్టు తెలిపింది. రోడీస్ రియాల్టీషోతో గుర్తింపు తెచ్చుకున్న మిలింద్ తో తాను ప్రేమలో ఉన్నానని వివరించింది.

జీవితంలో స్ఫూర్తినిచ్చేవారు, ప్రేమను పంచేవారు కావాలని, తనకు అలాంటి వ్యక్తి మిలింద్ రూపంలో దొరికాడని అవికా పేర్కొంది. లైఫ్ లో మనల్ని జాగ్రత్తగా చూసుకునేవారు దొరకడం అసాధ్యమని భావిస్తారని, కానీ తనకు మిలింద్ రూపంలో అలాంటి వ్యక్తి దొరికాడని అవికా హర్షం వ్యక్తం చేసింది. "నా ప్రార్ధనల ఫలితం ఇతడే. ఈ మంచి వాడు నావాడు, నేనెప్పటికీ అతడి దాన్నే"  అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. గోవాలో మిలింద్ తో ఆస్వాదిస్తున్న ఫొటోలను కూడా పంచుకుంది.
Go Back to Shorts
Avika Gor
Milind Chandwani
Goa
Life Partner
Tollywood

More Telugu News