RRR: మొక్కలు నాటి మూడు సినీ యూనిట్లకు చాలెంజ్ విసిరిన ఆర్ఆర్ఆర్ యూనిట్.. వీడియో ఇదిగో

RRRMovie accepted our Ramaraju  ramcharans challenge
షార్ట్స్‌లో చూడండి
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న సినీనటుడు ప్రభాస్ అనంతరం రామ్ చరణ్ కి  చాలెంజ్ విసరడంతో ఆయన ఈ ఛాలెంజ్ ను స్వీకరించి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు  సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలు నాటిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత ఆలియా భ‌ట్, దర్శకుడు రాజమౌళి, ఆర్ఆర్ఆర్ సినిమా బృందం సభ్యులు అందరూ గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని ఆయన చాలెంజ్ చేశాడు. దీంతో ఈ రోజు ఆర్ఆర్ఆర్ బృందం ఇందులో పాల్గొని మొక్కలు నాటింది. అనంతరం చిరంజీవి ఆచార్య, ప్రభాస్ రాధేశ్యామ్, అల్లు అర్జున పుష్ప సినిమాల యూనిట్లకు ఆర్ఆర్ఆర్ బృందం చాలెంజ్ విసిరింది. మొక్కలు నాటుతూ తీసుకున్న వీడియోను ఈ సందర్భంగా పోస్ట్ చేసింది.
Go Back to Shorts
RRR
Tollywood
Prabhas
Rajamouli
Ramcharan

More Telugu News