ఆ అబ్బాయినే పెళ్లాడుతా... హోర్డింగ్ ఎక్కి హడలగొట్టిన మైనర్ బాలిక!
- ప్రేమికుడిని అక్కడికి తీసుకొచ్చిన పోలీసులు
- తల్లి తన ప్రేమను అంగీకరించడంలేదంటూ అమ్మాయి నిరసన
- అబ్బాయి సాయంతో అమ్మాయిని కిందికి దించిన పోలీసులు
బాలుడితో పెళ్లికి తన తల్లి ఒప్పుకోవడంలేదని, తల్లి ఒప్పుకోకపోయినా సరే బాలుడితో పెళ్లి చేయాల్సిందేనని ఆ అమ్మాయి పోలీసులకు తెలిపింది. దాంతో పోలీసులు ఆమె ప్రేమించిన కుర్రాడ్ని పట్టుకొచ్చి ఆమె ముందు నిలిపారు. దాంతో సంతృప్తి చెందిన ఆ బాలిక హోర్డింగ్ పైనుంచి దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పర్దేశిపుర పోలీస్ ఇన్ స్పెక్టర్ అశోక్ పాటిదార్ ఈ వివరాలను మీడియాకు తెలిపారు.