భవన నిర్మాణ, శిథిల వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ను ప్రారంభించిన కేటీఆర్
- జీడిమెట్లలో ప్లాంటును ప్రారంభించిన కేటీఆర్
- సిటీలో మొత్తం 5 ప్లాంట్లను ప్రారంభిస్తామన్న మంత్రి
- చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయవద్దని కోరిన కేటీఆర్
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఈ ప్లాంటు ద్వారా జీహెచ్ఎంసీ, రాంకీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో వ్యర్థాలను రీసైక్లింగ్ చేయనున్నట్టు చెప్పారు. ఎల్బీనగర్ లో ని ఫతుల్ గూడలో సంక్రాంతి పండుగ నాడు మరో ప్లాంటును ప్రారంభిస్తామని తెలిపారు. నగరంలో మొత్తం 5 ప్లాంట్లను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయవద్దని ప్రజలను కోరారు. చెత్త తరలింపు కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 1200 72659కి సమాచారం ఇవ్వాలని చెప్పారు.