Joe Biden: జో బైడెన్ గెలిస్తే పాకిస్థాన్ కు పండగే... ఎందుకంటే..!

Joe Biden as new US President most likely to make Pakistan very happy
షార్ట్స్‌లో చూడండి
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోవాలని ఎన్ని దేశాలు కోరుకుంటున్నాయనే విషయాన్ని పక్కన పెడితే... జో బైడెన్ గెలవాలని మాత్రం పాకిస్థాన్ గట్టిగా కోరుకుంటోంది. జో బైడెన్ గెలుపు ఖాయమే అనే వార్తలు వెలువడుతున్న తరుణంలో అప్పుడే పాకిస్థాన్ లో ఆనందకర వాతావరణం నెలకొంది. దీనికి పాకిస్థాన్ తో బైడెన్ కు ఉన్న అనుబంధమే కారణం.

గతంలో పాకిస్థాన్ లో అమెరికా దౌత్యవేత్తగా బైడెన్ పని చేశారు. ఆ దేశంతో బైడెన్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే బైడెన్ గెలవాలని ఆ దేశం గట్టిగా కోరుకుంటోంది. 2008లో బైడెన్ ను పాకిస్థాన్ తన రెండో అత్యున్నత పౌర పురస్కారం 'హిలాల్ ఇ పాకిస్థాన్'తో గౌరవించింది. గతంలో పాకిస్థాన్ కు 1.5 బిలియన్ల నాన్-మిలిటరీ సాయాన్ని అందించే కార్యాచరణ వెనుక బైడెన్, సెనేటర్ రిచర్డ్ లుగార్ ఉన్నారు. మరో విషయం ఏమిటంటే లుగార్ ను కూడా పాకిస్థాన్ 'హిలాల్ ఇ పాకిస్థాన్' పురస్కారంతో సత్కరించింది. పాకిస్థాన్ కు నిరవధికంగా సాయం అందించేందుకు తోడ్పడుతున్న వీరిద్దరికీ అప్పటి పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ బహిరంగంగా కృతజ్ఞతలు తెలిపారు.

బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే... పాకిస్థాన్ కు గతంలో మాదిరి మంచి రోజులు వస్తాయని ఆ దేశ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బైడెన్ అమెరికా అధ్యక్షుడు కావాలని పాకిస్థాన్ కోరుకోవడానికి ఇన్ని కారణాలున్నాయి. మరి ఇండియా విషయంలో బైడెన్ ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాల్సి ఉంది. మరోవైపు ఎన్నికల ప్రచారంలో భారతీయ అమెరికన్లను ఆకట్టుకోవడానికి బైడెన్ మన దేశానికి అనుకూలంగా కూడా మాట్లాడారు. అయితే, చైనాలోని ఉయ్ ఘర్ ముస్లింల సమస్యతో కశ్మీర్ లోయ పరిస్థితులను ముడిపెడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Go Back to Shorts
Joe Biden
USA
Pakistan

More Telugu News