వివాహం కోసం మతం మార్చుకోవడాన్ని నిషేధిస్తూ మధ్యప్రదేశ్‌లో త్వరలో చట్టం
- వరుసగా వెలుగులోకి వస్తున్న ‘లవ్ జిహాద్’ తరహా ఘటనలు
- వివాహం పేరుతో మతం మార్చుకోవడంపై ఉక్కుపాదం
- త్వరలోనే కఠిన చట్టాన్ని తీసుకొస్తామన్న సీఎం
దీనిని తాము ఎంతమాత్రమూ సహించబోమని, దీనిని అడ్డుకునేందుకు కఠిన చట్టాన్ని తీసుకొస్తామని అన్నారు. త్వరలోనే ఈ చట్టం అమల్లోకి వస్తుందన్నారు. లవ్ జిహాద్‌ను అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, హర్యానా రాష్ట్రాలు ఇటువంటి చట్టాన్ని తీసుకొస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ కూడా ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.