దేశంలో కొవిడ్-19 కేసుల అప్‌డేట్స్!
- గత 24 గంటల్లో 46,254 మందికి కరోనా
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 83,13,877
- మృతుల సంఖ్య 1,23,611
- కోలుకున్న వారు 76,56,478 మంది
గత 24 గంటల సమయంలో 514 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,23,611 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 76,56,478 మంది కోలుకున్నారు. 5,41,405 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 11,29,98,959 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 12,09,609 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.