vijaya shanthi: విజ్ఞులైన మన తెలంగాణ ప్రజలు ఇది గమనించాలి: విజయశాంతి

vijaya shanti slams trs
  • నిజాం నవాబుల తీరును తెలంగాణ చరిత్ర చెబుతుంది
  • అదే ధోరణిలో నేటి నయా టీఆర్‌ఎస్ దొరలు
  • ప్రజాస్వామ్యాన్ని తమ యంత్రాంగంగా వ్యవస్థీకృత చెల్లుబాటు చేశారు
  • దుబ్బాకలో టీఆర్ఎస్‌కు సరైన బుద్ధి చెప్పాలి
దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘నిజాం నవాబులు తమ విధేయులైన దొరల దన్ను, ఆర్థిక, భూ బలాలు, కిరాయి బలగాలతో ఏ విధమైన అధికారం చెలాయించారో తరతరాల తెలంగాణ చరిత్ర చెబుతుంది’ అని ఆమె అన్నారు.

‘అదే ధోరణిలో నేటి నయా టీఆర్‌ఎస్ దొరలు ప్రజాస్వామ్యాన్ని తమ అహంకారపు అదుపాజ్ఞలలోని యంత్రాంగంగా వ్యవస్థీకృత చెల్లుబాటు చేసి... తెలంగాణ బిడ్డలపై నడిపించే ప్రక్రియ జరుగుతున్నదనేది వాస్తవం. విజ్ఞులైన మన తెలంగాణ ప్రజలు ఇది గమనించి దుబ్బాక ఎన్నికలో టీఆర్ఎస్‌కు సరైన బుద్ధి చెబుతారని విశ్వసిస్తున్నాను’ అని విజయశాంతి అన్నారు.
vijaya shanthi
Congress
TRS
dubbaka

More Telugu News