ఏపీలో భారీగా పెరిగిన వాహన జరిమానాలు... నిబంధనలు ఉల్లంఘిస్తే మోత మోగుద్ది మరి!
- కేంద్ర చట్టానికి అనుగుణంగా జరినామాలు పెంచిన ఏపీ
- రెండు కేటగిరీల్లో జరిమానాలు
- బైక్ ల నుంచి నాలుగు చక్రాల వాహనాలన్నీ ఒకే కేటగిరీ
- మరో కేటగిరీలో భారీ వాహనాలు
కాగా, ఈ జరిమానాలను రెండు విభాగాలుగా విభజించారు. ఒక కేటగిరీలో ద్విచక్రవాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు ఉంటాయి. మరో కేటగిరీలో భారీ వాహనాలు ఉంటాయి.
ముఖ్యాంశాలు ఇవే..
- బైక్ ల నుంచి 7 సీట్ల కార్ల వరకు ఒకే జరిమానా.
- ఎక్కువసార్లు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు.
- సెల్ ఫోన్ డ్రైవింగ్ కు 10 వేల ఫైన్. ప్రమాదకర రీతిలో డ్రైవింగ్ చేసినా ఇదే జరిమానా.
- రేసింగ్ లో మొదటిసారి దొరికిపోతే రూ.5,000 జరిమానా, రెండోసారి కూడా పట్టుబడితే రూ.10,000 ఫైన్.
- వాహనాల బరువు చెకింగ్ కోసం ఆపినప్పుడు వాహనదారుడు ఆపకుండా వెళితే రూ.40,000 జరిమానా.
- ఓవర్ లోడ్ తో వెళితే రూ.20,000 ఫైన్, పరిమితికి మించి ఎన్ని టన్నులు ఉంటే ఒక్కో టన్నుకు రూ.2,000 అదనం.
- వాహనాల చెకింగ్ కు అడ్డుతగిలినా, వివరాలు, సమాచారం ఇచ్చేందుకు నిరాకరించినా రూ.750 వడ్డన.
- నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే రూ.5,000 ఫైన్.
- నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే తయారీసంస్థలకు, డీలర్లకు మాత్రమే కాకుండా విక్రయదారులకు కూడా రూ.1,00,000 జరిమానా.
- అనుమతి లేని వ్యక్తులకు వాహనం ఇచ్చినా, అర్హత కంటే తక్కువ వయసున్న వారికి వాహనం ఇచ్చినా రూ.5,000 ఫైన్.
- డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హతలేని వారికి వాహనం ఇస్తే రూ.10,000 జరిమానా
- అవసరం లేకపోయినా హారన్ మోగిస్తే మొదటిసారి రూ.1,000, రెండోసారి రూ.2,000 ఫైన్.
- ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10,000 ఫైన్.
- పర్మిట్ లేని వాహనాలు నడిపితే రూ.10,000 జరిమానా.