నీట్ రాయలేకపోయిన విద్యార్థులకు తీపి కబురు అందించిన సుప్రీంకోర్టు
- కరోనా వల్ల నీట్ పరీక్ష రాయలేకపోయిన ఎందరో విద్యార్థులు
- అక్టోబర్ 14న పరీక్షకు అనుమతిస్తున్నట్టు తెలిపిన సుప్రీం
- అక్టోబర్ 16న వెల్లడి కానున్న ఫలితాలు
కరోనాను దృష్టిలో ఉంచుకుని పరీక్షకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఫలితాలను అక్టోబర్ 16న ప్రకటిస్తారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ విధిగా ధరించాల్సి ఉంటుంది. విద్యార్థుల చేతులను కూడా శానిటైజ్ చేస్తారు. మరోవైపు సుప్రీం నిర్ణయం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.